చైనా మాంజా విక్రయిస్తే చర్యలు
మంచిర్యాలక్రైం: చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రమోద్‌రావు హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాల మేరకు శనివారం రెండోరోజు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి జిల్లా కేంద్రంలోని గాలిపటాల దుకాణా లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చైనా మాంజా మారణాయుధమని అన్నారు. చైనా మాంజా వినియోగించినా విక్రయించినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే డయల్ 100 లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. తనిఖీల్లో ఎస్సైలు తిరుపతి, మజారొద్దీన్, ఏఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


