ప్రాణహిత ప్రాజెక్టు కాలువల సర్వే
నెన్నెల: తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బ్యారేజ్ వరకు గ్రావిటి కెనాల్ ద్వారా నీటిని తరలించేందుకు ఆర్వీ కన్సల్టెన్సీ ఏజెన్సీకి చెందిన పది మంది సర్వేయర్లు శనివారం మైలారం, జంగా ల్‌పేటలో సర్వే నిర్వహించారు. తక్కువ ఖర్చుతో నీటిని తరలించే అవకాశాలు పరిశీలించారు. పలు జిల్లాలకు సాగునీరు అందించేందుకు ఫిజబిల్టీ రిపోర్టు సిద్ధం చేసి నివేదిక ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వారు పేర్కొన్నా రు. ఈ సర్వే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించి రాష్ట్ర నీటి అవసరాలను తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. నా డు నిర్మించిన ప్రాణహిత చేవెళ్ల ప్రధాన కాలువలను పునర్వినియోగంలోకి తీసుకురావడానికి సర్వే చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు.


