ఊరికి వెళ్లేవారు సమాచారం ఇవ్వాలి
● సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాలక్రైం: సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లేవారు పోలీ సులకు సమాచారం అందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ఇంట్లో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కిటికీలు, గేటు, తాళం భద్రంగా ఉన్నాయో లేదో మరోసారి సరిచూసుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని, ఒకవేళ ఇప్పటికే ఉంటే పనిచేస్తుందో లేదో చెక్‌చేసుకోవాలన్నారు. సీసీ కెమెరా రికార్డింగ్ అంతా మొబైల్ ఫోన్‌లో చూసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.


