● పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెం
రామకృష్ణాపూర్: ప్రజల పక్షాన నిలుస్తూ నిరంతరం వారి హక్కుల కోసం పోరాడేది సీపీఐ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు, మాజీ ఎమ్మె ల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఎర్రజెండా పార్టీ పుట్టిందే శ్రమజీవుల హక్కుల కోసమని, అణచివేతలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ ఉంటుందన్నా రు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని సూపర్‌బజార్ సెంటర్‌లో శనివారం సాయంత్రం భారీ బహిరంగసభ నిర్వహించారు. అంతకుముందు స్థానిక రాజీవ్‌చౌక్ నుంచి సూపర్‌బజార్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సభ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందన్నారు. హక్కుల సాధన కోసం ప్రయోగించే సమ్మె హక్కు ను కూడా తీసే ప్రయత్నం చేస్తుందని, దీనిని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు. దేశంలో మోదీ నిరంకుశ పాలనకు స్వస్తి పలకాలంటే ఎర్రజెండా పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరముందన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ ఒకప్పుడు లక్ష 20వేల మంది ఉన్న సింగరేణి సంస్థ నేడు 40 వేలకు పడిపోయిందని, సంస్థను క్రమక్రమంగా దివాలా తీయించి ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. సంస్థను కాపాడుకోవా ల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మ ణ్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, మిట్టపెల్లి శ్రీనివాస్, మేకల దాసు, ఇప్పకాయల లింగయ్య, అక్బర్‌అలీ, పౌల్ పాల్గొన్నారు.
ప్రజా పోరాటాల జెండా సీపీఐ
శ్రీరాంపూర్: ప్రజా పోరాటాల జెండా సీపీఐ అని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్‌రెడ్డి అన్నారు. శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద పైలాన్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దున్నేవాడికే భూమి దక్కాలనే నినాదంతో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఈ నెల 18న ఖమ్మంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనికి 40 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జో గుల మల్లయ్య, నాయకులు రేగుంట చంద్రశేఖర్, కారుకూరి నగేష్, కే.వీరభద్రయ్య, లింగం రవి, మిర్యాల రాజేశ్వరరావు, బాజీసైదా, కిషన్ రావు, రవీందర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.


