‘జీవో 229 రద్దు చేయాలి’
మంచిర్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవో 229 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, హెచ్‌ఆర్‌డీఏ, మెడికల్ టాస్క్‌ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్న చట్ట విరుద్ధమైన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎంసీ సభ్యుడు డాక్టర్ యెగ్గన శ్రీనివాస్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రవిప్రసాద్ రావుల, సెక్రెటరీ, హెచ్‌ఆర్‌డీఏ అధ్యక్షుడు డాక్టర్ అనిల్‌కుమార్ ముత్తినేని, ఐఎంఏ కోశాధికారి డాక్టర్ చందూరి సంతోశ్, డాక్టర్ సుఖభోగి వెంకటేశ్వర్లు, డాక్టర్ కేవీఎల్‌ఎన్ మూర్తి, డాక్టర్ చంద్రదత్, డాక్టర్ కాటం లక్ష్మీనారాయణ, డాక్టర్ కేఎంఎన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


