‘ఉపాధి హామీ పేరు మారిస్తే ఊరుకోం’
మందమర్రిరూరల్: కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారిస్తే చూస్తూ ఊరుకునేది లేదని డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక సీఈఆర్ క్లబ్ సమీపంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఉపాధి లేక పట్టణాలకు తరలిపోతుంటే వలసలను నివారించడానికి సోనియాగాంధీ నేతృత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఉపాధి హామీ చట్టాన్ని అమలుచేసి నిరుద్యోగులకు వందరోజుల పని కల్పించారని గుర్తు చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉపేందర్, నాయకులు సొత్కు సుదర్శన్, సంతోష్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.


