ఆ ఊరంతా సౌర వెలుగులే!
లక్సెట్టిపేట: ప్రభుత్వం కేంద్రీయ బండార్ పేరుతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకానికి సోలార్ పవర్ పైలట్ గ్రామంగా మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట ఎంపికై ంది. టీజీ రెడ్‌కో (తెలంగాణ రినోవెబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) సంస్థకు పనులను అప్పజెప్పారు. ప్రభుత్వం మొదటి విడతగా రాష్ట్రంలోని కొన్ని గ్రామాలను ఎంపిక చేసింది. అందులో మంచిర్యాల జిల్లా నుంచి ఏకై క గ్రామంగా వెంకట్రావుపేట ఎంపికై ంది. రెడ్‌కో శాఖ అధికారులు గ్రామంలో సర్వే పనులు నిర్వహిస్తున్నారు. సోలార్ వాడకం వలన విద్యుత్ ఆదా కావడమే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్‌లలోపు ఉచిత విద్యుత్ వలన డిస్కం శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రత్యేక పద్ధతి ద్వారా పనులు ప్రారంభించారు. విద్యుత్, సోలార్ శాఖ అనుసంధానంతో పనులు నిర్వహిస్తున్నారు.
ఏకై క పైలట్ గ్రామం
వెంకట్రావుపేట సోలార్ పైలట్ గ్రామంగా ఎంపిక కావడంతో రెడ్‌కో శాఖ అధికారులు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా 1,160 ఇళ్లను సర్వే చేశారు. ప్రస్తుతం 120 ఇళ్లకు సోలార్ ఇచ్చేందుకు ఇంటిస్లాబ్‌పై ప్యానెల్ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభిస్తున్నారు. ప్రతీ ఇంటిపై 180 స్క్వేర్ ఫీట్ల వైశాల్యం ఉండాలంటున్నారు. ప్రతీ ఇంటికి రోజుకు రెండు కిలో వాట్లు ఉచితంగా కేటాయించారు. ఒక్కో ఇంటికి సుమారు రూ.1,70,000 ఖర్చు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మూడు నెలల లోపు గ్రిడ్ పనులు పూర్తి చేసి ఇళ్లల్లో సోలార్ విద్యుత్ వెలిగిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న మీటర్‌ను తొలగించి నెట్ మీటర్ ఏర్పాటు చేస్తామని అందులో విద్యుత్ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ ఉంటుందన్నారు. రోజుకు ఐదు యూనిట్లు ఉచితంగా సరఫరా అందుతుందని, ఆపైన వాడితే చార్జి చెల్లించాల్సి ఉంటుందన్నారు. 25 సంవత్సరాల వరకు వీటి ఉపయోగం ఉంటుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత ఐదేళ్ల వరకు సంస్థ ఆధ్వర్యంలో 24 గంటల అత్యవసర సేవలు అందిస్తారు. ఆ తర్వాత 20 సంవత్సరాల పాటు ఇంటి యజమానులు మెయింటనెన్స్ చేసుకోవాలి. మార్చిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
సంతోషంగా ఉంది
సోలార్ పవర్ పైలట్ గ్రామంగా వెంకట్రావుపేట ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ అధికారులు సర్వే పనులు చేస్తున్నారు. ప్రస్తుతం 120 ఇళ్లకు త్వరలోనే సోలార్ ప్యానెల్‌ను అమర్చనున్నారు.
– నలిమెల రాజు, సర్పంచ్
పనులు ప్రారంభించాం
జిల్లాలో ఏకై క పైలట్ సోలార్ గ్రామంగా వెంకట్రావుపేట ఎంపికై ంది. ఇళ్ల సర్వే పనులు పూర్తి చేశాం. త్వరలోనే ఇళ్లపై సోలార్ ప్యానెల్ బిగిస్తాం. సోలార్ విద్యుత్ వలన డిస్కం వారి నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. భవిష్యత్ అంతా సోలార్‌పై ఆధార పడి ఉంటుంది.
– శ్రీనివాస్, సోలార్ శాఖ
జిల్లా మేనేజర్, మంచిర్యాల
ఆ ఊరంతా సౌర వెలుగులే!
ఆ ఊరంతా సౌర వెలుగులే!
ఆ ఊరంతా సౌర వెలుగులే!


