రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్
ఖానాపూర్: ములుగు జిల్లా ఏటూరు నాగారంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పట్టణంలోని ప్రభుత్వ బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి కుడ్మెత భీంరావు ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించినట్లు పాఠశాల హెచ్‌ఎం జీ.రాజేందర్ తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ 6వ రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో కడెం మండలంలోని గంగాపూర్‌కు చెందిన విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు పేర్కొన్నారు. సదరు విద్యార్థిని డీటీడీవో జాదవ్ అంబాజీ నాయక్, జిల్లా గిరిజన క్రీడా అధికారి భుక్య రమేశ్‌నాయక్, చెస్ కోచ్ రాంజీ, తదితరులు అభినందించారు.


