ట్రెజరీ ద్వారా వేతనాలు అందించాలి
దండేపల్లి: దేవాదాయ శాఖ చట్టంలో సవరణలు చేసి అధికారుల మాదిరిగానే అర్చక ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గోగు ఉపేంద్ర శర్మ, కన్వీనర్ డీవీఆర్ శర్మ డిమాండ్ చేశారు. దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయ కా ర్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లా అర్చక, ఉద్యోగ జేఏసీ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హా జరై మాట్లాడారు. దేవాదాయ శాఖ అధికారులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు, పెన్షన్సు అందుతున్నాయని, అర్చకులకు మాత్రం ఈ సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లు పూర్తిచేసుకున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక, దినసరి వేతన ఉద్యోగులను సైతం రెగ్యులర్ చేయాలన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమణరావు, గూడెం ఆలయ ప్రధాన అర్చకులు రఘస్వామి, ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకులు సంపత్‌స్వామి, నరహరిశర్మ పాల్గొన్నారు.
భాషా నైపుణ్యం, ఆలోచనలు పెంపొందించుకోవాలి
మంచిర్యాలఅర్బన్: విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యాలతో పాటు ఆత్మవిశ్వాసం, విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించుకోవాలని డీఈవో యాదయ్య సూచించారు. శుక్రవారం ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ ఆసోసియేషన్ (ఎల్టా) ఆధ్వర్యంలో ఒలింపియాడ్, ఎలోక్యూషన్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోటీల్లో గెలుపొందిన విజేతలను ప్రకటించారు. ఒలింపియాడ్ విభాగంలో స్ట్రీం–1 జూనియర్‌లో గుడిరేవు ఉన్నత పాఠశాలకు చెందిన అలెగ్జాండర్ ప్రథమ స్థానం, సీనియర్ విభాగంలో కిష్టాపూర్ పాఠశాలకు చెందిన అనన్య, టెడ్ టాక్ జూనియర్ విభాగంలో హజీపూర్ పాఠశాల విద్యార్థి వికాసిని ప్రథమ స్థానం, సీనియర్ విభాగంలో గుడిరేవు పాఠశాల విద్యార్థిని అహల్య ప్రథమస్థానంలో నిలిచారు. స్రీమ్–2 జూనియర్ విభాగంలో టీజీఎంఎస్ మంచిర్యాల పాఠశాలకు చెందిన సమన్విత (ప్రథమ), సీనియర్ విభాగంలో మంచిర్యాల మోడల్ స్కూల్‌కు చెందిన సంజన (ప్రథమ), టెడ్‌టాక్‌లో మోడల్ స్కూల్ విద్యార్థులు జూనియర్ విభాగంలో భవిత, సీనియర్ విభాగంలో సాహిత్య ప్రథమ స్థానంలో నిలిచారు. న్యాయనిర్ణేతలుగా సత్యనారాయణ, కమలాకర్, ఉపేందర్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఎల్టా రాష్ట్ర బాధ్యులు బాబ్జీ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణమూర్తి, కల్యాణి, జిల్లా ప్రభు త్వ పరీక్షల విభాగం అధికారి మల్లేశం, సెక్టోరల్ అధికారి భరత్, తదితరులు పాల్గొన్నారు.
ట్రెజరీ ద్వారా వేతనాలు అందించాలి


