17ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు చేరిన రఫీక్
కై లాస్‌నగర్: ఫిట్స్.. అతడి మానసిక, ఆరోగ్య పరిస్థితి దెబ్బతీసింది. 25ఏళ్ల వయస్సుల్లో ఇంటికి దూరం చేసింది. అతడి ఆచూకీ కోసం కుటుంబ స భ్యులు చాలా చోట్ల వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఎప్పటికై నా తిరిగి రాకపోతాడా అనే ఎదు రు చూస్తూనే ఉన్నారు. వారి ఎదురుచూపులు 17 ఏళ్ల తర్వాత ఫలించాయి. ఓ స్వచ్ఛంద సంస్థ చే యూత, చొరవ అతడిని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చాయి. ఆ కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ పట్టణం ఖా నాపూర్‌లోని అబ్దుల్లాచౌక్‌కు చెందిన షేక్ మహబూబ్, జాహెదాబేగం దంపతులకు నలుగురు సంతానం. మూడో కుమారుడు షేక్ రఫీక్ తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో ఫిట్స్‌కు గురయ్యాడు. అప్పటి నుంచి మానసిక, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. 25ఏళ్ల వయస్సులో ఇంటికి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం ఎన్ని చోట్ల వెతికినా ప్రయోజనం లేకపోయింది. కాగా, గత ఏడాది జూౖ లె 4న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో మతిస్థిమితం లేకుండా తిరుగుతుండగా మహారాష్ట్రకు చెందిన శ్రద్ధ రీహ్యాబిటేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు గ మనించారు. చలించినపోయి వారు అతడిని మ హారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న ఆ సంస్థ రీహ్యాబిటేషన్ సెంటర్‌కు తరలించారు. అప్పటి నుంచి అక్కడ వైద్యం అందిస్తుండడంతో మానసిక, ఆరోగ్య పరి స్థితి మెరుగైంది. తన వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు చెప్పడంతో ఆ సంస్థ ప్రతినిధి రాకేష్ శుక్రవారం ఆదిలాబాద్‌కు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. 17ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన కుమారుడిని చూసి తల్లి, అన్నదమ్ముల్లో ఆనందం వెల్లివిరిసింది. కుటుంబీకులు, బంధువులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఎన్జీవో ప్రతినిధిని సైతం సత్కరించారు. తప్పిపోయి, ఎక్కడెక్కడ గడిపాడనే వివరాలపై ఆరా తీశారు. తిరిగి రాడనుకున్న వ్యక్తి ఏళ్ల తర్వాత ఇంటికి చేరడంపై ఆ కుటుంబీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


