జాతరకు వెళ్లివస్తూ తిరిగిరాని లోకాలకు
ఆసిఫాబాద్‌రూరల్: జాతరకు వెళ్లివస్తుండగా జరి గిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మే రకు మండలంలోని ఆడదస్నాపూర్ గ్రామ పంచా యతీ పరిధిలోని దెబ్బడిగూడకు చెందిన ఆత్రం అ న్నిగా (25), టేకం పొచ్చిగా (21), ఆత్రం లచ్చు శు క్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై తిర్యాణి మండలంలోని దంతన్‌పల్లిలో జరుగుతున్న భీమయ్యక్ జాతరకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో రా త్రి బాబాపూర్ గ్రామ సమీపంలో ఎడ్లబండిని ఢీ కొట్టారు. పొచ్చిగా, అన్నిగాకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన ఆత్రం లచ్చును ఆటోలో జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య కోసం మంచిర్యాల్‌కు రెఫర్ చేశారు. క్షతగాత్రుడిని ప్రైవేట్ వాహనంలో మంచిర్యాలకు తీసుకెళ్లమని వైద్యసిబ్బంది చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 108కు ఫోన్ చేసినా సరైన సమయంలో రా కపోవడంతో ఆటోలో తీసుకొచ్చామన్నారు. వైద్య సిబ్బందితో వాగ్వివాదానికి దిగి గదిలోకి చొరబడి మందులను కింద పడేశారు. ప్రభుత్వ అంబులెన్స్ రావడంతో క్షతగాత్రుడిని అందులో మంచిర్యాలకు తరలించడంతో ఆందోళనకారులు శాంతించారు.
జాతరకు వెళ్లివస్తూ తిరిగిరాని లోకాలకు
జాతరకు వెళ్లివస్తూ తిరిగిరాని లోకాలకు


