మద్ది చెట్లను పరిశీలించిన అధికారులు
ఎఫెక్ట్..
కోటపల్లి: మండలంలోని కొత్తపల్లి అటవీ ప్రాంతంలోగల మద్దిచెట్లను గుర్తు తెలియని దుండగులు న రికి దసలి పట్టుపురుగులు సాగు చేసే ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని గురువారం సాక్షిలో ‘యథేచ్ఛగా మద్దిచెట్ల నరికివేత’ శీర్షికన కథనం ప్రచురితం కాగా అటవీశాఖ అధికారులు స్పందించారు. ఎఫ్‌డీవో సర్వేశ్వర్ కొత్తపల్లి అటవీ ప్రాంతంలో నరికివేసిన మద్దిచెట్లను పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లు నరికివేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మద్దిచెట్లపై దసలిపురుగులు సాగు చేసే చెట్లకు నంబర్‌తో గుర్తింపు చేసినట్లు అధికారులు తెలిపారు. అటవీప్రాంతంలో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు నిఘా ఏర్పాటు చేయాలని ఎఫ్‌డీవో అధికారులకు సూచించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి సదానందం, సిబ్బంది పాల్గొన్నారు.
అధికారులతో మాట్లాడుతున్న ఎఫ్‌డీవో
మద్ది చెట్లను పరిశీలించిన అధికారులు


