గంజాయి పట్టివేత
భీమిని: కన్నెపల్లి మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇ ద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి లభించినట్లు తాండూర్ సీఐ దేవయ్య, కన్నెపల్లి ఎస్సై భాస్కర్‌రావు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల గ్రామానికి చెందిన సుంది ల్ల ప్రభాకర్, రౌతు మారుతి బెల్లంపల్లి పట్టణంలో ని రడగంబాల బస్తీకి చెందిన పిడుగురాళ్ల చందర్ అలియాస్ చందు నుంచి 200 గ్రాముల గంజాయి కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. పోలీసులు వా రి నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని కేసు న మో దు చేశారు. గంజాయి అమ్మడం, కొనుగోలు చే యడంతో పాటు వినియోగించడం చట్టరీత్యా నిషేధమని తెలిపారు. ఎవరైనా ఇలా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో గంజాయి అమ్మకాలు, కొనుగోళ్లు జరిగితే వెంటనే ‘డయల్ 100’కు సమాచారం ఇవ్వాలని సూచించారు.


