జీరో పెండెన్సీ లక్ష్యంతో పనిచేయాలి
శ్రీరాంపూర్: జీరో పెండెన్సీ లక్ష్యంతో పనిచేయాలని రామగుండం రీజియన్ సీఎంీపీఎఫ్ కమిషనర్ కే గోవర్ధన్ తెలిపారు. గురువారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో సీఎంపీఎఫ్‌కు సంబంధించిన ప్రయాస్ కార్యక్రమంలో భాగంగా జీరో పెండెన్సీ లక్ష్యంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ లావాదేవీలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రిటైర్డ్ ఉద్యోగుల క్‌లైమ్‌లను సీ కోర్సు పోర్టల్ ద్వారా సత్వరమే పరిష్కరించాలని తెలిపారు. ఈ సందర్భంగా 266 రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీలు అందించారు. శ్రీరాంపూర్ డీజీఎం (పర్సనల్) ఎస్.అనిల్‌కుమార్, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి ఎం.కొమురయ్య, సీనియర్ పీవో ఎస్.సురేందర్ పాల్గొన్నారు.


