కేజీబీవీల్లో బాలికలకు మెరుగైన విద్య
మంచిర్యాలఅర్బన్: కేజీబీవీలు బాలికల విద్యకు నిలయాలని, భద్రతతోపాటు మెరుగైన విద్య అందిస్తున్నాయని డీఈవో యాద య్య అన్నారు. బుధవారం స్థానిక ప్రైవేటు హోటల్‌లో మంచిర్యాల, నిర్మల్ జిల్లాల కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మోడల్‌స్కూల్ గర్‌ల్స్ హాస్టల్స్ వార్డెన్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి ఫలితా లు, ఆత్మవిశ్వాసాన్ని కల్పించడంలో కేజీబీవీలు ముందు వరుసలో ఉన్నాయని తెలిపారు. కేజీబీవీల నిర్వహణ మరింత సమర్థవంతంగా చేయడం కోసమే రెసిడెన్షియల్ తరహా శిక్షణ అన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లు విజయలక్ష్మి, చౌదరి, సత్యనారాయణమూర్తి, నిర్మల్ జిల్లా కో–ఆర్డినేటర్ నవీన జ్యోతి, అసిస్టెంట్ జెండర్ కో–ఆర్డినేటర్ రమాదేవి, మా స్టర్ ట్రైనర్ జ్యోతి, మంచిర్యాల, నిర్మల్ కేజీ బీవీల ప్రత్యేక అధికారులు, మోడల్ స్కూల్ గర్‌ల్స్ హాస్టల్ కేర్ వార్డెన్లు పాల్గొన్నారు.


