నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలి
జన్నారం: ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని, కల్తీ చేసినా, నాణ్యత తగ్గించినా చట్టపరమైన చర్యలు తప్పవని మంచిర్యాల ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వాసురామ్ హెచ్చరించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ఫాస్ట్‌ఫుడ్, బేకరీలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆహారంలో కల్తీ వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందన్నారు. కొన్ని హోటళ్లు నాణ్యత లేని తినుబండారాలు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, బేకరీల్లో ఆహార నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించామని, నాణ్యత తగ్గినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


