ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
లక్సెట్టిపేట: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జూనియర్ సివిల్ జడ్జి కాసమల సాయికిరణ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానం వద్ద కోర్టు ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతోపాటు శిక్ష పడుతుందని తెలిపారు. అనంతరం అందరితో నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ, న్యాయవాది గణేష్, ఏఎస్సై సుధాకర్, కానిస్టేబుళ్లు సంజీవ్, రాజమౌళి పాల్గొన్నారు.


