ఎఫెక్ట్..
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
మంచిర్యాలఅర్బన్/కాగజ్‌నగర్‌రూరల్: సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో మొదటిసారిగా సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. డిసెంబర్ 26న ‘సాక్షి’లో పండుగకు రైలు కూతపెట్టేనా? శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కాజీపేట్ నుంచి కాగజ్‌నగర్ వరకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. బస్సులు, రైళ్లు సరిపోక కిక్కిరిసిన ప్రయాణంతో ఇబ్బందులు పడుతున్న విషయాలపై అధికారులు స్పందించారు. ఈనేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు బై వీక్లీ ప్రత్యేక జనరల్ కోచ్ అన్ రిజర్వుడ్ రైళ్లు నడపనున్నట్లు సర్క్యూలర్ విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు జనవరి 9, 10 తేదీల్లో రైలు నడపనున్నారు. సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు జనవరి 09, 18 తేదీల్లో నడుస్తుంది. 07469బై 70 నాంపల్లి హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్ నాంపల్లికి సంక్రాంతి ప్రత్యేక రైలుకు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగరి, ఆలేరు, జనగాం, ఘనపూర్ కాజీపేట్ మీదుగా పలు రైల్వే స్టేషన్‌లతో పాటు మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే స్టేషన్‌లలో హాల్టింగ్ సదుపాయం కల్పించారు. పండుగకు రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైలు నడపటంపై ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు ఫణి హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికుల ఇబ్బందులపై స్పందించిన ఎమ్మెల్యేహరీష్‌బాబుకు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు.


