చట్టం అందరికీ సమానమే...
చట్టం అందరికీ సమానమే. పోలీసు శాఖలో పని చేసే ఏ స్థాయి అధికారి అయినా సివిల్ తగాదాలు, కొట్లాటలు, పోలీసు అని బెదిరింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పడితే సహించేది లేదు. శాఖ పరమైన చర్యలతోపాటు కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సీసీఎస్ ఎస్సై జీవన్‌తోపాటు మరికొందరిపై కేసు నమోదైంది. అక్రమాలకు పాల్పడిన అధికారులపై పూర్తి స్థాయి విచారణ అనంతరం కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదుదారులను ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే నేరుగా డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. లేదా నేరుగా కలిసి ఫిర్యాదు చేసినా విచారణ అనంతరం చర్యలు తీసుకుంటాం.
– ఎగ్గడి భాస్కర్, డీసీపీ మంచిర్యాల


