క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం
రామకృష్ణాపూర్: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ టీ–20 లీగ్ మ్యాచ్‌లలో భాగంగా పట్టణంలోని ఠాగూర్ స్టేడియంలో బుధవారం హైదరాబాద్–ఖమ్మం మధ్య జరిగిన క్రికెట్ పోటీలను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆర్‌ఆర్‌నగర్‌లో రూ.50 లక్షలతో హిందూ శ్మశానవాటిక, ఆర్‌కే1 ప్రాంతంలో రూ.15 లక్షలతో క్రైస్తవ స్మశానవాటిక పనులు ప్రారంభించారు. రూ.40లక్షలతో లైటింగ్ వ్యవస్థ కోసం కొనుగోలు చేసిన టవర్ వగన్ వెహికల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, తహసీల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ రాజు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


