ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని సరస్వతినగర్ కాలనీకి చెందిన ఆర్.శ్రీచరణ్ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల చివరి వారంలో మైసూర్ వేదికగా పోటీలకు కాకతీయ యూనివర్సిటీ జోన్ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు కోచ్ జయేంద్ర పటాస్కర్ తెలిపారు. యూనివర్సిటీ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారుడితో పాటు తల్లిదండ్రులు వెంకటరమణ–సంధ్యను పలువురు ప్రత్యేకంగా అభినందించారు.
వన్యప్రాణిని హతమార్చిన ఏడుగురు రిమాండ్
లక్సెట్టిపేట: వన్యప్రాణిని హతమార్చిన కేసులో ఏడుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు స్థానిక ఎఫ్ ఆర్వో అనిత తెలిపారు. లక్సెట్టిపేట ఫారెస్టు రేంజి పరిధిలోని చెల్లంపేట శివారులో ఈనెల 6న సాంబార్ జింకను హతమార్చిన చెల్లంపేట గ్రామానికి చెందిన జైనేని మల్లేశ్, సొల్లు శ్రీనివాస్, జైనేని అశోక్, మారాపు రంజిత్, మారపు ప్రశాంత్, జైనేని మధుకర్, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రామ్మూర్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆమె పేర్కొన్నారు.
ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక


