డెంజిల్ నార్జరీని ఆదర్శంగా తీసుకోవాలి
ఆదిలాబాద్: కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ జూడో ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్న డెంజిల్ నార్జరీని క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం జూడో కోచ్ రాజును సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూడో రాజు వద్ద శిక్షణ పొందిన డెంజిల్ నార్జరీ రాష్ట్రస్థాయి జూడో చాంపియన్‌షిప్ పోటీల్లో 17 బంగారు, 2 రజతాలు, ఒక కాంస్య పతకం సాధించాడని గుర్తు చేశారు. 14 సార్లు జాతీయ జూడో చాంపియన్‌షిప్ టోర్నీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించాడన్నారు. కరీంనగర్‌లో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న అతడు ఏడాదిగా భారత క్రీడా సంస్థ ఆధ్వర్యంలో కేరళలోని స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లో ఎలైట్ స్థాయి శిక్షణ పొందుతున్నాడని గుర్తు చేశారు. అలాంటి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.


