
ప్రజల అవసరాలకే ఇసుక రీచ్
జైపూర్: జిల్లా ప్రజల అవసరాలు తీర్చడానికి ఇందారం వద్ద మరో ఇసుక రీచ్ అందుబాటులోకి తీ సుకు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపా రు. మండలంలోని ఇందారం గోదావరి బ్రిడ్జి వద్ద మైనింగ్ శాఖ ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను సోమవారం ఆయన మైనింగ్ ఏడీ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మన ఇసుక వాహనం ద్వారా సరఫరా చేస్తారని తెలి పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతిబాపురావు, పంచాయతీ కార్యదర్శి సుమన్ పాల్గొన్నారు.
జిల్లాలో కొత్తగా ఐదు..
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి పనులు, ప్రజలు అవసరాలకు సరిపడా ఇసుక లభ్యతకు కొత్తగా ఐదు ఇసుక రీచ్‌లు మంజూరు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం కలెక్టర్ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముల్కల్ల, వేంపల్లి–1, వేంపల్లి–2, తాళ్లపల్లి, ఇందారం ఇసుకరీచ్‌లను ప్రారంభించినట్లు తెలిపారు. మైనింగ్ శాఖ ఏడీ జగన్‌మోహన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఉన్నత లక్ష్యాలను సాధించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: భవిష్యత్‌లో విద్యార్థులు ఉ న్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ కుమార్ దీప క్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచి ర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలతో కలిసి ప్రభుత్వ బీసీ బాలుర, బాలికల కళాశాల వసతిగృహాల్లో అత్యధిక మార్కులు సాధించిన ఇంటర్మీడియెట్ విద్యార్థులు గురుండ్ల రవీందర్, ఎస్.అభినయ్‌లను శాలువాలతో సన్మానించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అ భివృద్ధి అధికారి పురుషోత్తంనాయక్, ఎస్సీ కార్పొరేషన్ డీడీ దుర్గాప్రసాద్, వసతి గృహ సంక్షేమ అధి కారులు మోసీన్ అహ్మద్, సుధాలక్ష్మి పాల్గొన్నారు.
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్