
దాడి ఘటనలో ముగ్గురిపై కేసు
తానూరు: మండలంలోని కోలూరు గ్రామానికి చెందిన రుద్రముడ్ గంగాధర్‌పై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన రుద్రముడ్ అశోక్, అతడి భార్య కౌసల్య, పెద్ద కుమారుడు సుధాంపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై భానుప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 16న రుద్రముడ్ అశోక్ పొలంలోని ఒడ్డుపై ఉన్న వేపచెట్టు కొట్టివేస్తున్నాడు. ఇంతలో వరుసకు సోదరుడైన గంగాధర్ వచ్చి చెట్టు ఎందుకు కొట్టివేస్తున్నావని ప్రశ్నించాడు. దీంతో గంగాధర్‌పై అశోక్‌తోపాటు అతడి భార్య కౌసల్య, పెద్ద కుమారుడు సుధాం గంగాధర్‌పై రాళ్లతో దాడి చేశారు. గంగాధర్‌కు తీవ్ర గాయాలు కాగా కుటుంబీకులు అతడిని చికిత్స కోసం భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గంగాధర్ మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దాడికి పాల్పడ్డ అశోక్, కౌసల్య, సుధాంపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.
అదుపుతప్పి లారీ బోల్తా
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని యాపల్ ప్రాంతంలో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కై కలూరు నుంచి చేపల లోడుతో అమృత్‌సర్ (బెల్లంపలి వైపు) వెళ్తున్న లారీని డ్రైవర్ నిద్రమత్తులో నడుపుతుండగా అది అదుపుతప్పి యాపల్ ప్రాంతంలో రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌ను ఢీకొని బోల్తా పడింది. బోల్తాపడ్డ లారీని గమనించక వెనుక నుంచి బొలెరో ఢీకొంది. బొలెరో వెనుక మరో లారీ నిలిచి ఉండగా దానిని డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో, లారీ డ్రైవర్లకు గాయాలయ్యాయి. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ కాగా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తులో అజాగ్రత్తగా లారీ నడిపిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ట్రాక్టర్ దగ్ధం
చెన్నూర్‌రూరల్: మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన బోగె శంకర్‌కు చెందిన ట్రాక్టర్ ప్రమాదవశాత్తు కాలిపోయింది. వివరాలు.. మంగళవారం ఒత్కుపల్లి సమీపంలో ట్రాక్టర్‌తో డ్రైవర్ దుక్కి దున్నుతుండగా డీజిల్ అయిపోయింది. డ్రైవర్ వెళ్లి డీజిల్ తీసుకుని వచ్చేసరికి ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌కు మంటలు అంటుకున్నాయి. ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. అప్పటికే ట్రాక్టర్ కాలిపోయింది. ట్రాక్టర్ విలువ సుమారు రూ.8లక్షల వరకు ఉంటుందని బాధితుడు శంకర్ తెలిపాడు.

దాడి ఘటనలో ముగ్గురిపై కేసు