
ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ బాలబాలికల జట్ల ఎంపిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి ఎస్‌ఆర్‌కేఎం నర్సింగ్ కళాశాలలో మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ జూనియర్ బాలబా లికల జట్లను ఎంపిక చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హ్యాండ్‌బాల్ రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు సత్తా చాటాలని సూచించారు. పతకం సాధించి జిల్లా క్రీడా పతాకాన్ని రాష్ట్ర స్థాయిలో ఎగురవేయాలని పిలుపునిచ్చారు. జూనియర్ బాలబాలికల జట్లు ఈ నెల 28నుంచి 30వరకు నల్గొండ జిల్లా నకిరేకల్‌లో నిర్వహించనున్న 47వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ బాలబాలికల హ్యాండ్‌బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటాయని తెలి పారు. జట్లకు ఈ నెల 22నుంచి 27వరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హ్యాండ్‌బాల్ అసో సియేషన్ రెఫరీ బోర్డు చైర్మన్, హ్యాండ్‌బాల్ కోచ్ అరవింద్ సునార్కర్, జాతీయ క్రీడాకారులు రాకేశ్, సాయి, కార్తిక్, సంజయ్, ప్రవీణ్ పాల్గొన్నారు.
జూనియర్ బాలికల జట్టుకు..
జూనియర్ బాలికల జట్టుకు డీ శృతి, డీ మౌనిక, అనూష, జే అశ్విత, పీ శృతి, డీ వర్ష, ఎం.కుమారి, బీ మమత, కే స్వీటీ (మంచిర్యాల), ఏ రేణుక, టీ సౌమ్య, కే మల్లిక (కుమురంభీం ఆసిఫాబాద్), పీ సింధు, కే చైతన్య, ఆర్.మైత్రి (ఆదిలాబాద్), సీ సుధ (నిర్మల్) ఎంపికయ్యారు.
జూనియర్ బాలుర జట్టుకు..
జే రవివర్మ, డీ సందేశ్, టీ అరవింద్, జే కార్తిక్, శ్రావణ్, ఎల్.సుందర్, ఎస్.పవన్ (మంచిర్యాల), కే రాంకుమార్, ఎస్.భానుప్రసాద్, డీ యోగి, డీ ఈశాంత్, జే సాయికిరణ్, పీ కార్తిక్ (కుమురంభీం ఆసిఫాబాద్), జే కళ్యాణ్, కే రాకేశ్, (ఆదిలాబాద్), ఆర్.రమేశ్ (నిర్మల్) ఎంపికయ్యారు.