
స్క్రాప్‌షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని సోఫీనగర్‌లోగల ఇండస్ట్రియల్ ఏరియాలోని స్క్రాప్ షాప్‌లో షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాలు.. పట్టణానికి చెందిన షేక్ ఫాజిల్ స్థానిక సోఫీనగర్‌లో స్క్రాప్ దుకాణం నడుపుతున్నాడు. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో దుకాణం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన వాచ్‌మన్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.7లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ అధికారులు అంచనా వేశారు. ఎవరికి ఎలాంటి హాని జరగలేదని తెలిపారు.
ట్రాక్టర్ బోల్తాపడి ఒకరి మృతి
తలమడుగు: ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొలాంగూడ గ్రామానికి చెందిన సీడాం సురేశ్ (22) కొన్నేళ్లుగా బరంపూర్ గ్రామానికి చెందిన లింగారెడ్డి వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ట్రాక్టర్‌ను అతి వేగంగా, అజాగ్రత్తగా నడుపుకొంటూ బరంపూర్ నుంచి పల్లి గ్రామానికి వెళ్తున్నాడు. ఈక్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సురేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న మెరుగు ప్రవీణ్‌కు త్రీవ గాయాలయ్యాయి. ప్రవీణ్‌ను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. సురేశ్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్సై రాధిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇసీ్త్ర చేస్తూ కరెంట్ షాక్‌తో ఒకరి దుర్మరణం
భైంసారూరల్: మండలంలోని సుంక్లీ గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఒకరు మృత్యువాత పడ్డారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అరిగెల ముత్యం (42) మంగళవారం రోజులాగే తన ఇంటి వద్ద ఎలక్ట్రికల్ ఇసీ్త్రపెట్టెతో బట్టలు ఇసీ్త్ర చేస్తున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. గమనించిన కుటుంబీకులు ము త్యంను చికిత్స కోసం భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
భైంసాటౌన్: పట్టణంలోని భైంసా–బాసర మార్గంలో భోకర్ చౌరస్తా సమీపంలోగల పెట్రోల్ పంపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వాలేగాంకు చెందిన పవార్ అచ్యుతానంద్ పాటిల్ (46) మంగళవారం సాయంత్రం భోకర్ చౌరస్తా వద్ద గల పెట్రోల్‌పంపు నుంచి రోడ్డుపైకి వస్తున్నాడు. ఈ సమయంలో బాసర వైపు నుంచి వచ్చిన మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో అచ్యుతానంద్ పాటిల్ కింద పడగా తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆటోలో ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు ఎమ్మెల్యే రామారావు పటేల్‌కు సమీప బంధువు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పరిచయస్తులు భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు.
కంటైనర్‌ను ఢీకొని యువకుడు..
నేరడిగొండ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రంలోని కేఆర్‌కే కాలనీకి చెందిన శాంతిస్వరూప్ (18) మంగళవారం ద్విచక్రవాహనంపై నిజామాబాద్‌కు వెళ్లి డిగ్రీ ఎంట్రన్స్ పరీక్ష రాసి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను గమనించక ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శాంతిస్వరూప్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఉదయం పేపర్ బాయ్‌గా పని చేయడంతోపాటు ఆదిలాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. అతడి మరణాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని ఎన్‌హెచ్‌ఏఐ అంబులెన్స్‌లో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

స్క్రాప్‌షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం

స్క్రాప్‌షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం

స్క్రాప్‌షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం

స్క్రాప్‌షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం