‘ఉదారి’కి రాష్ట్రస్థాయి పురస్కారం | - | Sakshi
Sakshi News home page

‘ఉదారి’కి రాష్ట్రస్థాయి పురస్కారం

May 21 2025 12:15 AM | Updated on May 21 2025 12:15 AM

‘ఉదారి’కి రాష్ట్రస్థాయి పురస్కారం

‘ఉదారి’కి రాష్ట్రస్థాయి పురస్కారం

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాకు చెందిన ప్రముఖ కవి ఉదారి నారాయణ తెలంగాణ సారస్వత పరిషత్‌ అవార్డుకు ఎంపికై నట్లు సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె.చిన్నయ్య మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నారాయణ రచించిన ‘మళ్లీ మనిషిలో కి..’ గ్రంథం రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో పురస్కారంతోపాటు రూ.20 వేల నగదు అందజేసి శాలువా, జ్ఞాపికతో సత్కరించనున్నట్లు తెలిపారు. నా రాయణ ఇప్పటివరకు ఏ డు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు, ఎనిమిది ఉత్తమ కవిత పురస్కారాలు అందుకున్నారు. నారాయణకు జిల్లా కవులు, రచయితలు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement