
టోర్నమెంట్ సక్సెస్ చేయాలి
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి కో రారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం టోర్నమెంట్ నిర్వహణపై సమావేశమై చర్చించారు. గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. టోర్నమెంట్‌కు రాష్ట్ర వ్యా ప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి జట్లు హాజరుకా నున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు అన్ని వసతుల కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, హాకీ శిక్షకులు పాల్గొన్నారు.