నేరం చేయాలంటే దడ పుట్టాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

నేరం చేయాలంటే దడ పుట్టాల్సిందే..

Apr 22 2025 12:13 AM | Updated on Apr 22 2025 12:13 AM

నేరం

నేరం చేయాలంటే దడ పుట్టాల్సిందే..

● ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన సీపీ ● నిందితులకు శిక్ష పడటమే లక్ష్యం ● పకడ్బందీగా సాక్ష్యాధారాల సేకరణ ● ఏడాదిలో 135 మందికి జైలు శిక్ష ● ఈ ఏడాది శిక్షలు పెంచేలా చర్యలు

మంచిర్యాలక్రైం: ఒక్కసారి నేరం చేసినవారు మరో సారి నేరాలకు పాల్పడకుండా వారికి సరైన శిక్ష పడేలా రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝూ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ న మోదు నుంచి నిందితుడికి శిక్ష పడేదాకా అన్ని జా గ్రత్తలు తీసుకుంటున్నారు. పక్కాగా సాక్ష్యాలు సేకరించి శిక్షల శాతాన్ని పెంచుతున్నారు. ఇప్పటికే ప లుసార్లు కమిషనరేట్‌ పోలీస్‌ అధికారులు, కోర్టు డ్యూటీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌, లైసన్‌ ఆఫీసర్లతో సీపీ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. 2024లో రామగుండం కమిషనరేట్‌ పరిధిలో 80 కే సుల్లో 135 మంది నిందితులకు శిక్ష పడేలా చేశారు. పెద్దపల్లి జిల్లాలో రెండు కేసుల్లో ముగ్గురికి యావజ్జీవ కారాగారం, మరో రెండు కేసుల్లో ఆరుగురికి పదేళ్ల జైలు, మంచిర్యాల జిల్లాలో మూడు కేసుల్లో ముగ్గురికి ఐదేళ్లు శిక్ష పడేందుకు కృషి చేశారు.

శిక్షలు పడిన ఘటనలు కొన్ని..

2016 సెప్టెంబర్‌ 17న మంచిర్యాల ఠాణా పరిధిలోని ఘడ్‌పూర్‌ పంచాయతీ పరిధి బాబానగర్‌కు చెందిన సండ్ర లక్ష్మణ్‌, అనిల్‌, అశోక్‌ను అదే గ్రామానికి చెందిన మనుబోతుల శ్రీనివాస్‌ గొడ్డలి, కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అప్పటి ఎస్సై వేణుగోపాల్‌రావు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి ఎదుట పీపీ మదన్‌మోహన్‌రావు కోర్టులో సాక్ష్యాలు ప్రవేశపెట్టగా నేరం రుజువైంది. దీంతో శ్రీనివాస్‌కు ఐదేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ 2024 మే 8న తీర్పునిచ్చారు.

2022లో మంచిర్యాల జిల్లా కన్నెపెల్లి ఠాణా పరిధి సుర్జాపూర్‌కు చెందిన దాసరి శ్రీనివాస్‌, రాజన్న బైక్‌పై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన పూదరి చంద్రశేఖర్‌ తన ట్రాక్టర్‌తో బైక్‌ ఎక్కించి గొడ్డలితో నరికి చంపుతానని బెదిరించాడు. ఫిర్యాదు అందుకున్న అప్పటి ఎస్సై గంగారాం కేసు నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువు కాగా అప్పటి న్యాయమూర్తి అర్పిత మారంరెడ్డి చంద్రశేఖర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

2017 అక్టోబర్‌ 21న జిల్లాలోని లక్సెట్టిపేట ఠాణా పరిధి ఇందిరానగర్‌లో ఇంటి ప్రహరీ విషయంలో మామిడి మల్లయ్య, దుంపల బంగారమ్మకు గొడవ జరిగింది. బంగారమ్మ, ఆమె కుమారులు సురేశ్‌, నరేశ్‌ మల్లయ్య కుమారులు చంద్రమౌళి, రాజగోపాల్‌, కృష్ణంరాజుపై తల్వార్లతో దాడి చేయగా చంద్రమౌళి మృతి చెందాడు. రాజగోపాల్‌, కృష్ణంరాజును గాయపరిచారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచి సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టగా నేరం రుజువైంది. బంగారమ్మ, నరేశ్‌, సురేశ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ అప్పటి న్యాయమూర్తి డీ వెంకటేశ్‌ 2022 జనవరి 8న తీర్పునిచ్చారు.

నేరస్తులు తప్పించుకోలేరు

నేరం చేసిన వారు చట్టం చేతి నుంచి తప్పించుకోలేరు. సీసీ ఫుటేజీ, వేలిముద్రలు, సెల్‌ఫోన్‌ కాల్‌డేటా, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. పంచనామా సమయంలో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్‌ చేసి కోర్టుకు అందజేస్తున్నాం. నేర దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన అధికారులకు రివార్డులిస్తూ ప్రోత్సహిస్తున్నాం.

– ఎగ్గడి భాస్కర్‌, డీసీపీ, మంచిర్యాల

నేరం చేయాలంటే దడ పుట్టాల్సిందే..1
1/2

నేరం చేయాలంటే దడ పుట్టాల్సిందే..

నేరం చేయాలంటే దడ పుట్టాల్సిందే..2
2/2

నేరం చేయాలంటే దడ పుట్టాల్సిందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement