బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం సాధించాలి
ఆదిలాబాద్‌రూరల్: తెలంగాణ గడ్డమీద బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం సాధించి రెడ్డి, వెల్మలను అధికారంలోంచి దింపడమే అంబేడ్కర్‌కు ఇచ్చే జన్మదిన కానుక అని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర ప్రారంభ సభలో మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పెషల్ స్టేటస్ ఫర్ తెలంగాణ ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణలో రా జ్యాధికారం సాధించేందుకు మహాశక్తిగా అవతరి స్తామన్నారు. రాజ్యాంగ హక్కులన్నీ సాధిస్తామన్నా రు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీని బలోపేతం చేద్దామన్నారు. లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్ర తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలు 670కి పైగా మండలాలు 12వేల గ్రామాల్లో మూడు సంవత్సరాల మూడు నెలలపా టు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రామయ్య యాదవ్, కుమారస్వామి, డీఎస్పీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు గణేశ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కా ల దత్తు, కలాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
● బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్


