రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
ఖానాపూర్: పట్టణ శివారులోని అర్బన్ పార్క్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఎస్సై రాహుల్ గైక్వాడ్ కథనం ప్రకారం..పట్టణంలోని నిర్మల్–ఖానాపూర్ ప్రధాన రహదారి మీదుగా కుమురం భీం చౌరస్తా నుంచి ఖానాపూర్ వైపు కారు వస్తుంది. నేరడిగొండ మండలం తరణమ్ గ్రామానికి చెందిన హన్మాండ్లు, ముత్యం బైక్‌పై ఖానాపూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తూ రాంగ్‌రూట్‌లో ఢీకొంది. వెనుక నుంచి వస్తున్న ప్యాసింజర్ ఆటోపై బైక్ పడడంతో ఆటో పల్టీకొట్టింది. ప్రమాదంలో హన్మాండ్లు, ముత్యం, ఆటోలో ఉన్న ఖానాపూర్‌లోని డబుల్ బెడ్రూం కాలనీకి చెందిన చిన్నయ్య, రమేశ్, చిన్నక్కలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నపట్పికి కారులో ఉన్న వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


