ఎల్లంపల్లిలో మరింత తగ్గిన నీటిమట్టం
మంచిర్యాలరూరల్(హాజీపూర్):వర్షాలు కురవకపోవడం, ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి ప్రవాహం లేకపోవడంతో జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట వద్ద నిర్మించిన ఎల్లంపల్లి(శ్రీపాద సాగర్) ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పడిపోతోంది. ఆదివారం నాటికి ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 148 మీటర్ల క్రస్ట్ లెవెల్ కాగా 143 మీటర్లుగా ఉంది. 20.175 టీఎంసీల సామర్థ్యానికిగాను 8 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో కింద 574 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఇందులో గూడెం ఎత్తిపోతల పథకానికి 145 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 308 క్యూసెక్కులు తరలిస్తుండగా, ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 20,192 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలి పెడుతున్నారు.


