● 15 మంది ప్రయాణికులకు గాయాలు ● తీవ్రంగా గాయపడిన బస్సు
నిర్మల్/నర్సాపూర్(జి): నర్సాపూర్(జి) మండలంలోని తురాటి గ్రామ ఎక్స్‌రోడ్ వద్ద 61వ జాతీయ రహదారి వద్ద శనివారం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలు, బస్సు డ్రైవర్ లతీఫ్, కండక్టర్ జంగం సుధారాణికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లోకేశ్వరం మండలం రాజురా నుంచి నిర్మల్ వెళ్తోంది. నిర్మల్ నుంచి కెమికల్ లోడ్‌తో భైంసా వైపు వెళ్తున్న లారీ ఓవర్‌టేక్ చేసేక్రమంలో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉండగా 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో నిర్మల్, భైంసా ఏరియా ఆసుపత్రులకు తరలించారు. లక్ష్మి, భోజవ్వ, గంగవ్వ, రాజేశ్వరి, గణేశ్, సరస్వతి, సజన్ తదితరులు చికిత్స పొందుతున్నారు. లారీ క్యాబిన్‌లో డ్రైవర్ గజ్జల శ్రీను ఇరుక్కుపోయి గంటసేపు నరకయాతన అనుభవించాడు. జేసీబీ సాయంతో బయటకు తీసి 108లో నిర్మల్ ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు లారీ డ్రైవర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వాసిగా గుర్తించారు. నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై సాయికిరణ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. నిర్మల్ డిపో మేనేజర్ పండరి, ఆర్టీసీ అధికారులతో ఘటన స్థలాన్ని పరిశీలించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నుజ్జునుజ్జయిన లారీ, బస్సు
● 15 మంది ప్రయాణికులకు గాయాలు ● తీవ్రంగా గాయపడిన బస్సు
● 15 మంది ప్రయాణికులకు గాయాలు ● తీవ్రంగా గాయపడిన బస్సు


