పిల్లలకు టీకాలు వేయించాలి
మంచిర్యాలటౌన్: ఏప్రిల్, మే, జూన్‌లో నిర్వహిస్తున్న స్పెషల్ క్యాచ్ అప్ టీకాలను పిల్లలకు తప్పనిసరిగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికా రి డాక్టర్ హరీశ్‌రాజ్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం జిల్లాలోని వైద్యాధికారులు, ఎంపీహెచ్‌పీలు, పర్యవేక్షకులతో జాతీయ టీకాల కార్యక్రమంపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లోనూ టీకాలు వేసుకోని వారిని గుర్తించి మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా వేస్తారని తెలిపారు. ప్రతీ బుధ, శనివారాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ అనిత చిన్నారులకు వేసే టీకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృపాబాయి, డాక్టర్ ప్రసాద్, డెమో బుక్క వెంకటేశ్వర్, డీపీఎం ప్రశాంతి, పద్మ, ప్రవళిక పాల్గొన్నారు.


