చికిత్స పొందుతూ ఒకరు..
వేమనపల్లి: గత నెల 20న మద్యం మత్తులో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గొర్లపల్లి కొత్త కాలనీకి చెందిన నికాడి నగేష్ (25) విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ హెల్పర్(ఎన్‌ఎంఆర్)గా పనిచేస్తున్నాడు. తనకు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదని తరచూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో గత నెల 20న గ్రామ సమీపంలో ఉన్న మామిడి తోటకు వెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చెన్నూర్, మంచిర్యాల, కరీంనగర్, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని సోదరుడు సాయికిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్యాంపటేల్ తెలిపారు. మృతుని తండ్రి విజయ్‌కుమార్ సైతం 11 నెలల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పెద్ద కుమారుడు మృతి చెందడంతో తల్లి అమృత విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.


