హోరెత్తిన రామనామం..! | - | Sakshi
Sakshi News home page

హోరెత్తిన రామనామం..!

Apr 7 2025 1:17 AM | Updated on Apr 7 2025 1:17 AM

హోరెత

హోరెత్తిన రామనామం..!

భైంసాటౌన్‌/నిర్మల్‌టౌన్‌: శ్రీరామనవమి పర్వదినాన జైశ్రీరామ్‌ నినాదాలతో జిల్లాకేంద్రంతో పాటు భైంసా పట్టణాలు మారుమోగాయి. ఆదివారం జిల్లాకేంద్రంలో హిందూవాహిని, భజరంగ్‌దళ్‌ సంఘాల ఆధ్వర్యంలో శ్రీరామ వీరహనుమాన్‌ విజయయాత్ర చేపట్టారు. స్థానిక దేవరకోట దేవస్థానం వద్ద నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, జిల్లా ఎస్పీ జానకిషర్మిల ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్‌సింగ్‌, స్వామివివేకానంద, చత్రపతి శివాజీ చిత్రపటాలు శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా ఎస్పీ జానకిషర్మిల, ఏఎస్పీలు రాజేశ్‌ మీనా, ఉపేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. భైంసా పట్టణంలో ఉదయం 11 గంటలకు పురాణబజార్‌లోని గోశాల వద్ద రాముడి విగ్రహానికి ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌, ఎంపీ గోడం నగేశ్‌, ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాశ్‌కుమార్‌తోపాటు హిందూవాహిని, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు పూజలు చేశారు. అనంతరం శోభాయాత్ర ప్రారంభించారు.

హోరెత్తిన రామనామం..!1
1/4

హోరెత్తిన రామనామం..!

హోరెత్తిన రామనామం..!2
2/4

హోరెత్తిన రామనామం..!

హోరెత్తిన రామనామం..!3
3/4

హోరెత్తిన రామనామం..!

హోరెత్తిన రామనామం..!4
4/4

హోరెత్తిన రామనామం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement