భైంసావాసికి 157వ ర్యాంకు
భైంసాటౌన్: పట్టణంలోని అయోధ్యనగర్‌కు చెందిన సుర్వే సాయికుమార్ గ్రూప్–1లో 157వ ర్యాంకు సాధించాడు. లోకేశ్వరం మండలం పొట్‌పెల్లి(బి)కి చెందిన రత్నమాల–సిద్ధేశ్వర్ దంపతులు కొన్నేళ్లుగా భైంసాలో నివాసముంటున్నారు. వీరి కుమారుడు సాయికుమార్ తిరుచ్చిలోని ఎన్‌ఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. కొద్దిరోజులు గుర్గావ్‌లోని మారుతి సుజుకీ కంపెనీలో పనిచేశాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో గ్రూప్–2లో 1907, గ్రూప్–3లో 744 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం గ్రూప్–1లోనూ సత్తాచాటాడు. యూపీఎస్సీ(సివిల్ సర్వీసెస్) సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.


