నిర్మల్‌టౌన్: నిర్మల్‌రూరల్ మండలంలోని రాణాపూర్‌లో గురువారం బెల్ట్‌షాపుపై దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టుకున్నట్లు ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి గ్రామానికి చెందిన ఆడే చందులాల్ కిరాణా దుకాణంలో తనిఖీలు నిర్వహించగా కింగ్ ఫిషర్ బీర్ బాటిళ్లు–75, ఒరిజినల్ ఛాయిస్ 90 ఎంఎల్ బాటిళ్లు–110, రాయల్ స్టాగ్ 180 ఎంఎల్ బాటిళ్లు–47, ఎంసీ 180 ఎంఎల్ బాటిళ్లు–52, ఇంపీరియల్ బ్లూ 180 ఎంఎల్ బాటిళ్లు–58 లభ్యమైనట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.73,187 ఉంటుందన్నారు. బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


