
పుస్తకాల పంపిణీ షురూ
మంచిర్యాలఅర్బన్: సర్కారు బడిలో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య, నో ట్‌పుస్తకాల పంపిణీ ప్రారంభమైంది. బుధవా రం జిల్లా బుక్ డిపో నుంచి మంచిర్యాల, న స్పూర్, హాజీపూర్ మండలాలకు చెందిన పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని డీఈవో యాద య్య ప్రారంభించారు. ఈ నెల 30న మందమర్రి, బెల్లంపల్లి, 31న కోటపల్లి, జూన్ 1న చెన్నూర్, జైపూర్, భీమారం, 3న భీమిని, కన్నెపల్లి, నెన్నెల, 4న లక్సెట్టిపేట, దండేపల్లి, 5న తాండూర్, కాసిపేట, 6న జన్నారం మండల కేంద్రాలకు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఎంఈవో పోచయ్య, సెక్టోరల్ అధికారి చౌదరి, బుక్‌డిపో మేనేజర్ వేణుమాధవ్ పాల్గొన్నారు.