
కుటుంబ సభ్యులతో శుభం
ఇంద్రవెల్లి: మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన రేకుల్‌వార్ శుభం యూపీఎస్సీ ఫలితాల్లో 790 ర్యాంక్ సాధించి ఈ ప్రాంత సత్తా చాటాడు. జర్నలిస్ట్ రేకుల్‌వార్ సత్యనారాయణ–గీత దంపతులకు నిలేశ్, నికిలేశ్, శుభం ముగ్గురు సంతానం. శుభం 1నుంచి ఐదో తరగతి వరకు మండలకేంద్రంలోని ప్రతిభ పాఠశాలలో, 6 నుంచి 10వ తరగతి వరకు కాగజ్‌నగర్‌లోని నవోదయలో, ఇంటర్మీడియెట్ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో పూర్తి చేశాడు. గౌహతి ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో నాలుగేళ్లుగా తీవ్రంగా కృషి చేస్తున్నాడు. మూడుసార్లు మంచి ర్యాంకు సాధించలేకపోయినా పట్టువదలకుండా చదివి నాలుగోసారి లక్ష్యాన్ని సాధించాడు. రెండేళ్లుగా ఢిల్లీలోని విజన్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ సారి 790 ర్యాంక్ సాధించడంతో కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగారు.
