మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉండేందుకు రూ.5 లక్షల జీవిత బీమా పథకం ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మంగళవారం నగరంలోని బండమీదిపల్లిలో ఈ పథకం లబ్ధిదారులకు బీమా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ఈ పథకం ఎంతో భరోసా కల్పిస్తుందన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అర్హులు ఆయా డివిజన్ కార్యాలయాలకు వచ్చి నమోదు చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరాజ్‌ఖాద్రీ, యాదగిరిగౌడ్, ప్రతాప్‌గౌడ్, కార్పొరేటర్ లక్ష్మీదేవి పాల్గొన్నారు. కాగా.. వివేకానంద నగర్‌కు చెందిన మహమ్మద్ అతారి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమెకు మెరుగైన చికిత్స నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.2.50 లక్షల విలువైన ఎల్‌ఓసీ పత్రాన్ని బాధిత కుటుంబసభ్యులకు యెన్నం అందజేశారు.


