జిల్లాలో ఈ ఏడాది వర్షపాతం లోటు కారణంగా భూగర్భ జలాలు గణనీయంగా తగ్గాయి. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ప్రస్తుతం జిల్లా సగటు నీటిమట్టం 6.57 మీటర్ల లోతుకు పడిపోయింది. ముఖ్యంగా కొన్ని మండలాల్లో భూగర్భజలాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణ నిర్మాణాలు వినియోగించుకోవాలి. బోర్ల ద్వారా నీటిని పొదుపుగా వాడుకోవాలి. రాబోయే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రజలు, స్థానిక సంస్థలు ఇప్పటి నుంచే నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
– రవిశంకర్,
జిల్లా భూగర్భజల శాఖ అధికారి
●


