జిల్లాలో నవంబర్ 1 నాటికి సాధారణ వర్షపాతం 607.9 మి.మీ., కాగా.. 378.2 మి.మీ., మాత్రమే నమోదైంది. దీంతో 37.8 శాతం లోటు వర్షపాతం నెలకొంది. చిన్నచింతకుంటలో అత్యధికంగా 62.2 శాతం లోటు ఉండగా.. మహబూబ్‌నగర్ రూరల్‌లో 52.4, అర్బన్‌లో 52, కోయిలకొండలో 43.5 శాతం లోటు నమోదైంది. నవాబుపేట, గండేడ్, మహమ్మదాబాద్ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాలు తక్కువగా కురవడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరడం తగ్గింది. ఫలితంగా భూగర్భ జలాలు తిరిగి నిండుకునే అవకాశం తగ్గిపోయింది. మరోవైపు వ్యవసాయ అవసరాలకు బోర్ల నుంచి నీటిని తోడుతుండటంతో జలమట్టాలపై మరింత ఒత్తిడి పెరుగుతోంది.
● ఏడాదిలో 6.57 మీటర్ల మేర
తగ్గిన జలాలు
● హన్వాడలో అత్యధికంగా 21.64 మీటర్లకు పతనం
● ఇప్పటి నుంచే మేల్కోకపోతే
తాగునీటికీ ముప్పు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): జిల్లాలో వర్షాభావ పరిస్థితులు భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా వేసవి చివర్లో కనిపించే నీటి ఎద్దడి ఈసారి శీతాకాలం ప్రారంభంలోనే మొదలవడం ఆందోళన కలిగిస్తోంది. వానలు లేక చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండకపోవడం.. భూగర్భజలాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో బోర్లు, బావులపై ఆధారపడిన రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో అక్టోబర్ నాటికి సగటు భూగర్భ జలమట్టం 11.96 మీటర్లకు పడిపోయింది. గతేడాది ఇదే నెలలో 5.39 మీటర్లుగా ఉన్న నీటిమట్టం ఈసారి ఏకంగా 6.57 మీటర్ల మేర లోతుకు వెళ్లింది. మరోవైపు జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 37.8 శాతం తక్కువ వర్షం నమోదైంది. 17 మండలాలకు గాను 13 మండలాల్లో వర్షపాతం లోటు నెలకొంది. వర్షాలు కురవాల్సిన సమయంలో ముఖం చాటేయడంతో భూగర్భ జలాల రీచార్జి తగ్గిపోయింది.
ఏడాదిలోనే 6.57 మీటర్ల పతనం
జిల్లా భూగర్భ జలవనరుల శాఖ గణాంకాల ప్రకారం 2025 అక్టోబర్‌లో జిల్లా సగటు భూగర్భ జలమట్టం 5.39 మీటర్లుగా నమోదైంది. 2026 జూలైలో 10.79 మీటర్లకు చేరగా.. ఆగస్టులో 10.12, సెప్టెంబర్‌లో 10.51 మీటర్లుగా నమోదైంది. అక్టోబర్‌లో ఏకంగా 11.96 మీటర్లకు పడిపోయింది. అంటే సెప్టెంబర్‌తో పోలిస్తే నెల రోజుల్లోనే మరో 1.45 మీటర్ల మేర లోతుకు వెళ్లింది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే 6.57 మీటర్ల మేర పతనమైంది. సాధారణంగా వర్షాకాలంలో భూగర్భజలాలు పెరగాలి. కానీ, ఈసారి వర్షాలు కురవకపోవడంతో ఆశించిన స్థాయిలో నీటిమట్టం పెరగకపోగా.. మరింత లోతుకు పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది.
జిల్లాలో భూగర్భ జలాల వివరాలు ఇలా.. (మీటర్లలో)
6.22
హన్వాడ
21.64
గండేడ్
బాలానగర్
నవాబుపేట
జడ్చర్ల
మిడ్జిల్
కోయిలకొండ
మ.నగర్ రూరల్
మ.నగర్ అర్బన్
అక్టోబర్– 2025
3.00
మహమ్మదాబాద్
5.11
అక్టోబర్– 2026


