మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మంగళవారం జిల్లాస్థాయి క్రాస్‌కంటీ పరుగు ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఉపాధ్యక్షులు రాజేంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర జెండాఊపి ప్రారంభించారు. వచ్చేనెల 6వ తేదీన నారాయణపేటలో జరగనున్న రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా క్రాస్‌కంట్రీ పోటీల్లో పాల్గొనే మహబూబ్‌నగర్ జిల్లా అథ్లెట్ల ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం సభ్యులు తెలిపారు. అండర్–16 బాలబాలికలకు 2కిలోమీటర్ల పరుగు, అండర్–18 బాలురకు 6 కిలోమీటర్ల పరుగు, బాలికలకు 4కిలోమీటర్ల పరుగు, అండర్–20 జూనియర్ పురుషులకు 8 కిలోమీటర్ల పరుగు, మహిళలకు 6 కిలోమీటర్ల పరుగు, పురుషులు, మహిళలకు 10 కిలోమీటర్ల పరుగు పందెంలలో ఎంపికలు నిర్వహించారు. ఎంపికై న తుది జట్టును తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆనంద్‌కుమార్, శ్రీనివాసులు, కె.రమేష్‌బాబు, పి.శ్రీనివాస్, ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో
విజేతలుగా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, 17 విభాగాల ఉమ్మడి జిల్లా బాలబాలికల సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. కార్యదర్శి వేణుగోపాల్ క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ రానున్న ఎస్‌జీఎఫ్ పోటీల్లో రాణించాలని కోరారు. పట్టుదల, సమష్టిగా ఆడితే క్రీడల్లో విజయాలు సాధించవచ్చని అన్నారు. జిల్లా విద్యార్థులు క్రీడల్లో ప్రతిభచాటి జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ ఎంపికలకు దాదాపు 250 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మాజీ ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్‌బాబు, పీడీలు నాగరాజు, రాఘవేంద్ర, నాగమణి, లక్ష్మినారాయణ, చరణ్, మోహన్, శ్రీకాంత్, సునీత, గౌరి, వెంకటయ్య పాల్గొన్నారు.


