నల్లమలను పర్యాటకంగా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

నల్లమలను పర్యాటకంగా తీర్చిదిద్దుతాం

Nov 25 2026 1:19 AM | Updated on Nov 25 2026 1:19 AM

● రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ

మంత్రి జూపల్లి కృష్ణారావు

అచ్చంపేట: జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతానికి ఆధ్యాత్మికంగా, పర్యాటకపరంగా మరింత గుర్తింపు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి మద్దిమడుగును సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గిరిజన లంబాడీల ఆరాధ్య దైవమైన సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ భారీ విగ్రహాన్ని మద్దిమడుగులో ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతం భవిష్యత్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సేవాలాల్‌ స్మతిని చిరస్థాయిగా నిలిపేలా మద్దిమడుగులో 20 ఎకరాల స్థలంలో రూ.100 కోట్ల వ్యయంతో భారీ విగ్రహం ఏర్పాటు, ఈ ప్రాజెక్టులో భాగంగా భవనాన్ని కూడా నిర్మించేందుకు మొదటి విడతగా రూ.38 కోట్ల పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే మద్దిమడుగుకు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గుర్తింపు లభించి.. స్థానికులకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అలాగే మద్దిమడుగు అభివృద్ధికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడంతోపాటు ఆలయ ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రూ.20 కోట్లు వెచ్చిస్తామన్నారు. సీఎం అచ్చంపేట పర్యటనలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభిస్తారని చెప్పారు. పేదలు, మహిళలు, రైతులు, యువత, వెనకబడిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అందించడంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సీఎం బహిరంగ సభకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా దేవరకొండ నియోజకవర్గ ప్రజలు, గిరిజనులు, మహిళలు, రైతులు, యువత పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మంత్రి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement