సమస్యలపై ఎక్కుపెట్టి రచనలు సాగించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై ఎక్కుపెట్టి రచనలు సాగించాలి

Nov 25 2026 1:19 AM | Updated on Nov 25 2026 1:19 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సాహిత్యం స్తబ్దుగా మారిందని, అలా ఉండొద్దని అది నిత్యం ప్రవహించే గుణంతో ఉంటేనే సజీవంగా నిలుస్తుందని తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందచారి అభిప్రాయపడ్డారు. జిల్లాకేంద్రంలోని వాగ్దేవి జూనియర్‌ కళాశాలలో తెలంగాణ సాహితీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచిక, తటిల్లతలు పుస్తకాల ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలోని పలు సమస్యలపై కవులు తమ కలాలను ఎక్కుపెట్టి రచనలు సాగించాలని ఆకాంక్షించారు. అంతకుముందు తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచికను ప్రముఖ వైద్య డాక్టర్‌ ఎ.మధుసూదన్‌రెడ్డి ఆవిష్కరించగా, బీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ పరిమళ్‌ సమీక్షించారు. తటిల్లతలు మెరుపు కవిత్వ పుస్తకాన్ని ఎంవీఎస్‌ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్‌ సుభాషిణి ఆవష్కరించగా, తెలంగాణ సాహితీ ప్రచార కార్యదర్శి ప్రమెద్‌కుమార్‌ సమీక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు ఖాజా మైనద్దీన్‌, కార్యదర్శులు బసవరాజప్ప, కాళిదాసు, బాదేపల్లి వెంకటయ్యగౌడ్‌, విజేత వెంకటరెడ్డి, పలువురు కవులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement