నల్లమలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ.. అడవినే నమ్ముకుని జీవిస్తున్న మమ్మల్ని తల్లి ఒడి నుంచి విడదీయడం సమంజసం కాదు. మేము ఇక్కడే ఉంటాం. ప్రభుత్వం మాకు అండగా ఉంటూ పెంటల్లోనే జీవనోపాధి కల్పించాలని ఆశిస్తున్నాం.
– చిగుర్ల లింగేష్, డిగ్రీ విద్యార్థి, సార్లపల్లి
పూర్తి పరిహారం అందాకే నిర్ణయం..
మాకు చెప్పినట్లుగా పూర్తి పరిహారం ఇవ్వా లి. బాచారం దగ్గర స్థలం చూపించారు. ఇళ్లు, భూమి, పునరావాస కేంద్రంలో అన్ని వసతులు, ఉపాధి కల్పించిన తర్వాతే బయటకు వెళ్తాం. కొంతమందికి పరిహార చెక్కులు అందాయి. అందరికీ అందిన వెంటనే నిర్ణ యం తీసుకుంటాం. – కంపల్లి అంజనేయులు,
గిరిజనేతరుడు, సార్లపల్లి
కొందరు ఇబ్బంది పెడుతున్నారు
సార్లపల్లి నుంచి 5 చెంచు కుటుంబాలే వెళ్తున్నాయి. 80 కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి. అందరు వెళ్తే మీరెలా ఉంటారని కొందరు ఇబ్బంది పెడుతున్నారు. దశాబ్దాలుగా వేదన అనుభవిస్తూ పోరాడుతున్నాం. గిరిజనుల పేరిట చెంచులను ఇబ్బంది పెడితే ఊరుకోం. – జల్లా గురవమ్మ,
అటవీ హక్కుల కమిటీ అధ్యక్షురాలు, సార్లపల్లి
చెంచుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
అమ్రాబాద్ ఫారెస్ట్‌లో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. భవిష్యత్‌లో మానవ, వన్యప్రాణుల మధ్య ఘర్షణ పెరిగే అవకాశముంటుంది. పెంటలు, గ్రామాల తరలింపు స్వచ్ఛంద పునరావాస కార్యక్రమం. అంగీకరించే కుటుంబాలకు మెరుగైన వసతులు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తాం.
– రేవంత్ చంద్ర, డీఎఫ్‌ఓ, నాగర్‌కర్నూల్
బలవంతం లేదు..
హైదరాబాద్‌లోని కాలనీల తరహాలో బాచారం పునరావాస కేంద్రంలో అడవి బిడ్డలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఎలాంటి ఇబ్బందులు రాకుండా వసతులు కల్పిస్తాం. చెంచులను ఇబ్బంది పెట్టేది లేదు. బలవంతం లేదు.. స్వచ్ఛందంగా వచ్చిన వారికి పునరావాసం కల్పిస్తాం. – జూపల్లి కృష్ణారావు,
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి


