మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలో శాశ్వత తాగునీటి పరిష్కారానికి రూ.220 కోట్లతో 18 మిలియన్ లీటర్ల నీటి నిల్వ సామ ర్థ్యం కలిగిన 14 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. మౌలాలిగుట్ట, మెట్టుగడ్డ, టీచర్స్‌కాలనీలలో నిర్మించనున్న ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్ (ఓహెచ్‌ఎస్‌ఆర్)లకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం వీరన్నపేటలోని హజ్రత్ హతావుల్లా షరీఫ్ మున్సి దర్గా ప్రహరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 20 మిలియన్ లీటర్ల నీటినిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ, పెరుగుతున్న అవసరాలకు సరిపోవడం లేదన్నారు. వాస్తవానికి పైపులైన్ లీకేజీలు, పంపింగ్ సామర్థ్యం తగ్గడం, నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయన్నారు. వీటిని అధిగమించేందుకు గాను ఇప్పటికే 8 ట్యాంకుల పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన వాటిని త్వరలోనే చేపడతామన్నారు. ఇవన్నీ పూర్తయితే తాగునీటి సమస్య ఉండదన్నారు. నగరంలో మైనారిటీల సంక్షేమానికి సుమారు రూ.45 కోట్లు కేటాయించామన్నారు. ప్రార్థన స్థలాల అభివృద్ధికి అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయా కార్యక్రమాలలో ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ నాయకులు సిరాజ్‌ఖాద్రీ, రమేష్ యా దవ్, వర్ధ రవి, అశ్వాక్, అజ్మత్‌అలీ, అబ్దుల్‌హ క్, నసీర్, మైనొద్దీన్ రఫీ, శివ పాల్గొన్నారు.
● ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి


