కార్పొరేషన్‌కు మహర్దశ రానుంది | - | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌కు మహర్దశ రానుంది

Aug 21 2026 7:15 AM | Updated on Aug 21 2026 7:15 AM

కార్పొరేషన్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నాం. 14 వాటర్‌ ట్యాంకుల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉండగా.. ఇప్పటికే తొమ్మిదింటికి శంకుస్థాపన చేశాం. మరో మూడింటికి శుక్రవారం శంకుస్థాపన చేస్తాం. మురుగు, వర్షపు నీటిని వేరు చేసి ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసేందుకు అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం రూ.వెయ్యి కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి. పది రోజుల్లో అండర్‌గ్రౌండ్‌ పనులు ప్రారంభిస్తాం.

– యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే

పనులు వేగంగా సాగుతున్నాయి

మురుగునీటి శుద్ధికి మూడు ఎస్టీపీలను నిర్మిస్తున్నాం. పాలకొండ వద్ద పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వీటి ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి వినియోగానికి అనుకూలంగా మార్చుతాం. తాగునీటి కోసం 14 ట్యాంకులు, వర్షపు నీటి సేకరణకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం ప్రభుత్వం వేర్వేరుగా నిధులు మంజూరు చేసింది.

– ప్రవీణ్‌రెడ్డి, డీఈఈ,

పబ్లిక్‌హెల్త్‌ అండ్‌ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement