ఖిల్లాఘనపురం: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖిల్లాఘనపురంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల వివరాల మేరకు.. మిడ్జిల్ మండలం వస్పులకు చెందిన వడ్ల సురేంద్రాచారి (42)కి ఖిల్లాఘనపురం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తలు తరుచుగా గొడవ పడేవారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మి రెండేళ్ల క్రితం తల్లిగారి ఊరికి వచ్చి జీవనం సాగిస్తుంది. రెండు నెలల క్రితం సురేంద్రాచారి కూడా భార్య వద్దకు వచ్చాడు. అయితే రెండు రోజుల క్రితం డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరగడంతో భార్య అలిగి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన ఆయన.. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు మృతుడి భార్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు.


